భోపాల్, ఇండోర్, జబల్పూర్ లో సండే లాక్‌డౌన్‌

జ‌బ‌ల్పూర్‌: దేశవ్యాప్తంగా క‌రోనాఉదృతి కొనసాగుతోంది. క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. మధ్యప్రదేశ్ లో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో ఆదివారం రోజున లాక్ డౌన్ విధించారు. మూడు రోజుల క్రితమే ఈ ప్రకటన చేయడంతో దానికి ప్రజలు కూడా సన్నద్ధం అయ్యారు. రాత్రి నుంచి మూడు నగరాలు మూగబోయాయి. ఇకపై ప్రతి ఆదివారం రోజున ఈ మూడు నగరాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇలా లాక్ డౌన్ తప్పదని అక్క‌డి స‌ర్కార్ పేర్కొంది. కాగా మ‌రో వైపు మ‌హారాష్ట్రలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఇక్క‌డ భారీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. పలు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.