భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

స్టాక్‌హోమ్‌ : భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2020సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం వరించింది. అంతరిక్షంలో కృష్ణ బిలం ఎలా ఏర్పాటవుతుందో సూత్రీకరించిన బ్రిటన్‌ సైంటిస్ట్‌ రోజర్‌ పెన్‌రోజ్‌, జర్మనీ శాస్త్రవేత్త రీన్‌హర్డ్‌ గెంజెల్‌తో పాటు పాలపుంత కేంద్రకంపై పరిశోధనలు చేసిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ అండ్రియా గెజ్‌ను ఈ పురస్కారానికి నోబెల్‌ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు ఈసారి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను ద‌క్కించుకున్నారు. విశ్వంలో అత్యంత అసాధార‌ణ‌మైన విష‌యాన్ని వాళ్లు గుర్తించిన‌ట్లు స్వీడెష్ అకాడ‌మీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

 

 

Leave A Reply

Your email address will not be published.