మంచిర్యాల: నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు
మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా పోలీస్ భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు నకిలీ పత్తి విత్తనాలు అమ్మడానికి భీమారం వస్తున్నారన్న సమాచారం మేరకు రామగుండం టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు భీమారం ఎస్ఐ సంజీవ్ లు సంయుక్తంగా సిబ్బంది తో కలిసి ఆవడం రోడ్డు లోని చర్చి దగ్గర ఇద్దరు వ్యక్తులు నాలుగు సంచులతో అనుమానాస్పదంగా కనిపించగా వారి వద్దనున్న సంచులు విప్పి చూడగా పత్తి విత్తనాలు కలవు. వారిని వివరాలు అడగగా అతని పేరు మేలి కోట రామశేషయ్య, డోర్నిపాడు గ్రామం కర్నూలు జిల్లా అని ప్రభుత్వ అనుమతి లేకుండా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసుకొని తీసుకువచ్చి భీమారం కు చెందిన ఇప్పలపల్లి సమ్మయ్య కి అమ్ముడానికి వచ్చామని తెలపడం జరిగింది.వారిని అదుపులోకి తీసుకొని భీమారం వ్యవసాయ అధికారి అయిన మార్క్ గ్లాడిస్టన్ సమాచారం అందించగా వారు వచ్చి తనిఖీ చేసి ఆనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని వారి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి నకిలీ విత్తనాలు స్వాధీనపరచుకొని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపడం జరిగింది.
ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రైతులు ఎవరైనా నాణ్యమైన విత్తనాలను ఎరువులను పిచికారి చేసే మందులను గాని లైసెన్స్ డీలర్ల వద్ద కొనాలని రోజులు దగ్గర పెట్టుకోవాలని తక్కువ ధరలకు వస్తున్నాయని నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని ఎస్సై సూచించారు.