మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో రెండు పశువులు మృతి చెందాయి. కాగా ఈ దాడిపై స‌మాచార‌మందుకున్న అట‌వీశాఖ అధికారులు విచార‌ణ ప్రారంభించారు. కాగా వారి విచార‌ణ‌లో పులి దాడిలోనే పశువులు మృతి చెందాయని నిర్ధారించారు. అధికారులు పులిసంచారం నిజ‌మేన‌ని తేల్చ‌డంలో స‌మీప గ్రామాల ప్ర‌జ‌లు  భయాందోళనలు చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా పెద్ద పులి సంచారంపై వ‌స్తున్న వార్త‌ల‌పై జిల్లాలో ముఖ్యంగా బీమారం మండ‌లంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

1 Comment
  1. […] మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం.… […]

Leave A Reply

Your email address will not be published.