మంచిర్యాల: వ్యాక్సిన్ తీసుకున్న ZP చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ZP చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరితోపాటు ZP వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ZP స్టాప్ అందరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ZP చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకొని కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే వైద్యుల సూచనలు తీసుకోవాలని ZP చైర్మన్ తెలిపారు