మంత్రి కెటిఆర్‌ను కలిసిన అంశాల స్వామి
నల్లగొండ : అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ప్రగతిభవన్‌లో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపున అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతుండటంపై స్వామి సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.