మంత్రి పువ్వాడ అజ‌య్‌కు క‌రోనా..

హైద‌రాబాద్‌: తెలంగాణ ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌కు క‌రోనా సోకింది. ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లో త‌న‌కు కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలిన‌ట్లు మంత్రి స్వ‌యంగా వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకొని య‌థావిధిగా అన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటాన‌ని ఆయ‌న వివ‌రించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని మంత్రి అజ‌య్ వివ‌రించారు.

 

Leave A Reply

Your email address will not be published.