మంథనిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పుట్ట మధు
మంథని: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధూకర్ తెలిపారు. మంథని మండలం ఖానాపూర్, ఎగ్లాస్ పూర్,గోపాల్ పూర్, బిట్టుపల్లి, ధర్మారం, లాక్కెపూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధూకర్ ప్రారంభించారు.