మంథనిలో ఫ్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలి..
జెడ్పీ చైర్మన్ పుట్టమధుకు వినతి ప్రతం అందజేత

మంథని: తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తో వెన్నంటే ఉండి ముఖ్య భూమిక పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మంథనిలో ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బెజ్జంకి డిగంబర్, ఇతర జిల్లా టిఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుట్ట మధు మంథని పట్టణంలో తప్పకుండా విగ్రహం ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారని టిఆర్ ఎస్ నాయకులు తెలిపారు. జెడ్పీ చైర్మన్ విగ్రహ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.