మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. మరోసారి పసిడి ధర కిందకు దిగివచ్చింది. వరుసగా రెండు రోజులు కాస్త పైకి కదిలిన బంగారం ధర. బుధవారం మళ్లీ కిందకు దిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గింది. దాంతో రూ.45,440కు దిగివచ్చింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గడంతో రూ.41,650కి పరిమితమైంది.
అలాగే వెండి ధర మాత్రం రూ. 100 పెరిగి కిలో వెండి ధర రూ.71,100కు చేరింది.