మహబూబాబాద్ కలెక్టర్‌కు కరోనా

మహబూబాబాద్ : ఇప్పటి వరకు సామన్యుల మొదలు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, సినీ ప్రముఖులు పలువురు సెలబ్రెటీలు ఈ కరోనా మహమ్మరి బారిన పడ్డారు. తాజాగా కరోనా కలెక్టర్లను కూడా వదలడం లేదు.. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్ గౌతమ్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌తో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు. అధికారల సూచనలతో వారంత పరీక్షలు చేయించుకోనున్నారు. గత వారం రోజులలో కలెక్టరును కలిసిన వారు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.