మహారాష్ట్రలో కొత్త‌గా 10,187 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకీ విజృంభిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 10,187 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే తాజాగా రాష్ట్రంలో క‌రోనాతో 47 మర­ణాలు నమో­ద­య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ శ‌నివారం బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 22,08,586కు చేరింది. కాగా తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం మర­ణాల సంఖ్య 52,440కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 6,080 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.