మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్
గడ్చిరోలి: మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలోని ధనొరా పోలీస్ స్టేషన్ పరిధిలోన గల కొసమి-కిసనెల్లి అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమచారంతో సీ60 కమాండో ఫొర్సెస్ భారీగా కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొసమి-కిసనెల్లి అడవి మధ్యలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో పరస్పరం కాల్పులకు దిగినట్లు తెలిసింది.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరికొంతమంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఘటనతో గడ్చిరోలి జిల్లాలోని పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.