మహాశివరాత్రి ఉత్సవాల్లో సిఎం జ‌గ‌న్‌

గుడివాడ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్‌.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

రేపు పింగ‌ళి వెక‌య్య కుటుంబ స‌భ్యుల‌ను స‌న్మానించ‌నున్న జ‌గ‌న్‌
భార‌త జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను సిఎం జ‌గ‌న్ రేపు (శుక్రవారం) సన్మానించనున్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కుటుంబసభ్యులను సన్మానించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మాచర్లకు సీఎం జగన్‌ వస్తున్నారు. ఈ మేర‌కు గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.