మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. మొదటగా కృష్ణారెడ్డి కల్వకుర్తి పట్టణానికి సర్పంచ్ గా రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించి ఒకసారి ఎంపీపీగా పదవులు నిర్వహించారు. తొలితరం రాజకీయ నాయకుల్లో ఒకరైన కల్వకుర్తి నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 38992 ఓట్ల మెజార్టీతో, అదేవిధంగా 2004లో ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి76152 ఓట్లతో గెలుపొందారు. ఆయన అకాల మరణం పట్ల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.