మామ గంగిరెడ్డికి సీఎం జగన్‌ నివాళి

పులివెందుల: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కడప నుంచి పులివెందులకు చేరుకున్నారు. తన మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. కాగా ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళర్పించారు.

డాక్టర్ గంగి రెడ్డి మృతి పట్ల గవర్నర్ సంతాపం

విజయవాడ: ప్రముఖ వైద్యులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మామగారు డాక్టర్ ఇసి గంగిరెడ్డి మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం గంగిరెడ్డి మరణించారు. డాక్టర్ గంగి రెడ్డి వైయస్ఆర్ కడప జిల్లాలో ప్రఖ్యాత శిశువైద్యుని గానే కాక, ప్రజా వైద్యునిగా ప్రసిద్ధి చెందారని గ‌వ‌ర్న‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆయ‌న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నానన్నారు. సిఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి, ఆయన భార్య శ్రీమతి వై.ఎస్. భారతి, కుటుంబ సభ్యులకు గౌరవ హరి చందన్ హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

అలాగే గంగిరెడ్డి మృతిపై డా. కె.వి.పి.రామచంద్ర రావు సంతాపం ప్ర‌క‌టించారు. ఈమేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. డా.ఇ.సి.గంగి రెడ్డి గారి మరణ వార్త తీవ్రం గా కలచి వేసింది. వారి కుటుంబం తో మాకు నాలుగు దశాబ్దాల సాన్నిహిత్యం ఉన్నద‌ని పేర్కొన్నారు. పిల్లల డాక్టర్ గా అత్యంత పేరుగాంచిన వీరి మరణం వీరి కుటుంబ సభ్యులకే కాక పులివెందుల ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు తీరని లోటు అని అన్నారు. వారి పవిత్రాత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాని తెలిపారు. గంగిరెడ్డి భార్య శ్రీమతి డా.సుగుణమ్మకి ప్రగాడ సానుభూతిని తెలిపారు. గంగిరెడ్డి కుమార్తె భారతికి, అల్లుడు జగన్మోహన్ రెడ్డికి, విజయమ్మ గారికి సంతాపం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.