మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు
ఇద్దరు మావోయిస్టుల మృతి
ఆసిఫాబాద్ః ఆసిఫాబాద్ కొమరం భీమ్ అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి ప్రాణహిత నది తీరం వెంబడి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వాసి చుక్కాలుగా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్కౌంటర్ సమయంలో తెలంగాణ కీలకనేత భాస్కర్ అలియాస్ తప్పించుకున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజుల నుండి కూడా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాఅటవీ ప్రాంతంలో అటు పోలీసులు ఇటు మావోయిస్టులు అలజడి సృష్టిస్తున్నా కానీ ఇప్పటివరకు ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదు. కానీ నిన్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్ తో మావోయిస్టులు మళ్ళీ వారి ఉనికిని చాటుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆదివారం ఉదయం జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల ఒఎస్టీ ఉదయ్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందం సందర్శించింది.