క‌రోనా ఎఫెక్ట్‌: `మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి`!

ముషీరాబాద్, గోదావ‌రిఖ‌నిలో గేట్ల ముందు ఫ్లెక్సీలు

హైద‌రాబాద్‌: క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో జ‌నం అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా టెస్టుల‌కోసం ప‌రుగులు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్ఛందంగా క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ` ద‌య‌చేసి మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ముషిరాబాద్ ప‌ద్మ‌శాలి కాల‌నీ వెల్ఫేర్ సొటీలో ఓ కాలనీ వాసులు. అలాగే పెద్ద‌పెల్లి జిల్లా గోదావ‌రిఖనిలో ఓ ఇంటి ముందు `మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ సెల్ఫ్ పోస్ట‌ర్లు ఇంటికి ఏర్పాటు చేకుంటున్నారు.

హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్ ప‌ద్మ‌శాలి కాల‌నీ వెల్ఫేర్ సొటీలో కాలనీ వాసులు

వివ‌రాల్లోకి వెళ్తే..

క‌రోనా క‌ట్టికోసం ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌నిపిస్తోంది. క‌రోనా క‌ట్టడి కోసం ప‌లు కాలనీ వాసులు స్వ‌చ్చంధంగా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ప‌లు బ‌స్తీ వాసులు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లోని ముషిరాబాద్ ప‌ద్మ‌శాలి కాల‌నీ వెల్ఫేర్ సొటీలో కాల‌నీ వాసూలు `ద‌య‌చేసి మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ వినూత్నంగా ఓ ప్లెక్సీని ఇంటికి ఏర్పాటు చేసుకున్నారు.


పెద్ద‌పెల్లి జిల్లా గోదావ‌రిఖనిలో ఓ ఇంటి ముందు ఫ్లెక్సీతో కాలనీ వాసులు

అలాగే పెద్ద‌పెల్లి జిల్లా రామ‌గుండం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 30వ డివిజ‌న్‌లోని ఓ కాల‌నీలో ప‌లు ఇండ్ల‌కు `ద‌య‌చేసి మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ వినూత్నంగా పోస్ట‌ర్లు ఏర్పాటు చేసుకున్నారు. గాలిలోనూ కరోనా వ్యాప్తి వేగంగా ఉందని వైద్యశాఖ చెప్పడంతో కాలనీ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలనీవాసులు స్పష్టం చేశారు.

రెండో ద‌శ కొవిడ్ వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో.. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ముషీరాబాద్‌లోని ఓ ప‌ద్మ‌శాలీ కాల‌నీ వాసులు.. పెద్ద‌పెల్లి జిల్లా గోదావ‌రి ఖ‌నిలోని ఓ కాల‌నీలో ఈ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. స్వీయ నిర్భంధంతోనే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని. ఈ కొత్త కార్య‌క్ర‌మంతో త‌మ తోటి వారికి తెలియ‌జేస్తున్నారు. ఇండ్ల ముందు గేటుకు ప్లెక్సీ ఏర్పాటు చేసిన‌ ప్లెక్సీ చూసిన అందరూ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి శభాష్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.