మీ ప్రేమను మాకివ్వండి.!
మీ సేవకులుగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటాంః మంత్రి హరీశ్
దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్, మనెమ్మ గడ్డ, లచ్చపేటలో మంత్రి పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రైతుల ఉసురుపోసుకునే ప్రభుత్వం కేంద్రానిదైతే.. రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం తెలంగాణదన్నారు. బీజేపీ నాయకుల మాటలు వింటే.. చెట్లమీద విస్తారాకులు కుట్టినట్లు ఉన్నాయన్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం పై భారం పడి 8 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది, అయినా సంక్షేమాన్ని ఆపలేదు అని పేర్కొన్నారు. చెల్లాపూర్ బీసీ, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.15 లక్షలు, అలాగే వివిధ కుల సంఘాలకు రూ.60 లక్షలు మంజూరు చేశాం. మల్లాయపల్లి మారెమ్మ గడ్డలో రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకున్నాం అని తెలిపారు. దశల వారీగా మోరీల నిర్మాణాలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. యేడాదిలోపు దుబ్బాకలో పందులు లేకుండా చేద్దాం. సంచార జాతులు, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని, మిగిలిన వారికి ఎవరి స్థలంలో వారే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు. లచ్చపేటకు రెండు రోజుల్లో రూ.2కోట్లు మంజూరు చేస్తా. లచ్చపేటలో మహిళా భవనం, వార్డు ఆఫీసు, వైకుంఠ ధామం, జిమ్, ఇతర కుల సంఘ భవనాలకు కావాల్సిన నిధులు త్వరలోనే మంజూరు చేస్తానని` అని మంత్రి వెల్లడించారు. అలాగే దుబ్బాక నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణానికి కాలనీలు నిర్మించామని, త్వరలోనే మీ జాగలో మీరే ఇళ్లు కట్టుకోవచ్చునని, ఇందుకోసం గతంలోనే అసెంబ్లీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు, కరోనా నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గ పరిధిలో వెయ్యి ఇండ్లు వారి సొంత స్థలంలో నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు, దుబ్బాకకు వెయ్యితో పాటు అదనంగా వెయ్యి ఇండ్ల నిర్మాణాలు చేసుకునేలా సీఎం గారి అనుమతి తీసుకుందాం అని తెలిపారు. టీడీపీ చంద్రబాబు బాయిల కాడ బోర్లకు మీటర్లు పెడతానంటే.. రైతులంతా బాబుకు మీటర్లు పెట్టి వెనక్కి పంపారని, అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం ఓటు రూపంలో చెప్పాలని కోరారు. ఇక బాయిల కాడ మీటర్లు పెడితే.. 2500 కోట్లు ఆఫర్ ఇస్తామని బీజేపీ కేంద్రం ఆఫర్ ఇస్తే .. మీటర్లు వద్దు, 2500 కోట్లు వద్దు.. మా తెలంగాణ రైతుల సంక్షేమమే మాకు ముద్దు అని సీఎం కేసీఆర్ తిరస్కరించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వస్తుందని పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాం. కానీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎక్కడా ఆపలేదన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించినట్లుగానే ఏడాదిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం అన్నారు. పెళ్లి బరువు తల్లికి తెలుసని తల్లి పేరిట కల్యాణ లక్ష్మీ చెక్కులను అందిస్తున్నాం. ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల పెళ్లిలకు రూ.5555 వేల కోట్లు రూపాయలు సీఎం కేసీఆర్ సాయం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెసోల్లు పొద్దున్న దాకా 3 గంటలు, రాత్రిలో 3 గంటలు దొంగ కరెంటు ఇచ్చిండ్రు అని ఆరోపించారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి తెచ్చిన చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే.. రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం పై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు అని తెలిపారు. కార్పోరేట్ కంపనీల ఒప్పందంతో చేసుకుని నయా జమీందారి వ్యవస్థను తెచ్చిందని ఎవరి ప్రయోజనాల కోసం చేశారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.