ముంపు బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

కాకినాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కన్నబాబు

కాకినాడ: వరద ముంపుకు గురైన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాలను మంత్రి స్వయంగా సందర్శించి పరిశీలించారు. కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేట ఎస్సీ కాలనీలో అలాగే సిటీ పరిధిలో ఉన్న 48 , 49 డివిజన్లలో వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు , అధికారులు , వైసిపి నాయకులు , కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ముంపుకు గురైన కుటుంబాలను స్వయంగా కలుసుకొని వారు పడుతున్న ఇబ్బందులను మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో కమిటీలు వేసి సర్వే చేసే ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోతే ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.సుమారు 70 వెల కుంటుంబం .ముంపుకి గురి అయ్యాయని తెలిపారు. కరప మండలం వేములవాడ, వాకాడ,కూరాడ యండమూరు గ్రామాల్లో ముంపుకు గురైన పంట పొలాలు 590 హెక్టార్లలో వరి పంట ముంపు కారణంగా నష్టం వాటిల్లింది అని చెప్పారు. చేపలు రొయ్యలు చెరువులు ముంపు కు గురవడంతో ఆక్వా సాగుకు తీవ్ర నష్టం జరిగింది అని వివరించారు. మంత్రి వెంట వైసీపీ నాయకులు నురుకుర్తి రామకృష్ణ, జంగా గగారిన్ , రేఖరెడ్డి , కరీం భాషా తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.