ముంబ‌యిలో కూలిన భ‌వ‌నం.. 12 మంది మృతి

మృతుల్లో 8 మంది పిల్లలే!

ముంబ‌యి (CLiC2NEWS): దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబ‌యిలో బుధవారం ఎడతెగని భారీ వర్షం కారణంగా మాల్వానీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్క‌సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది స‌జీవ స‌మాధి అయ్యారు. మృతిచెందిన వారిలో 8 మంది పిల్లలు ఉన్నారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. శిథిలాల్లో మరికొంత మంది చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.

మృతులు: సాహిల్ సర్ఫరాజ్ సయ్యద్, 9, ఆరిఫా షేక్, 9, షఫీక్ ఎండి సలీం సిద్దిఖీ, 45, తౌసిఫ్ షఫీక్ సిద్దికి, 15, ఆలిషా షఫీక్ సిద్దిఖీ, 10, అల్ఫిసా షఫీక్ సిద్దిఖీ, 1.5, అఫినా బఫీక్ 6 షఫీక్ సిద్దిఖీ, 40, రహీసా బానో రఫిక్ సిద్దిఖీ, 40, తాహెస్ సఫిక్ సిద్దిఖీ, 12, జాన్ ఇర్రన్న 13 లు ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు గుర్తించారు.

గాయప‌డిన‌వారు: మరికుమారి హిరంగనా (30), ధనలక్ష్మి బేబీ (56), సలీం షేక్, (49), రిజ్వానా సయ్యద్, (33), సూర్యమణి యాదవ్, (39), కరీం ఖాన్ (30), గుల్జార్ అహ్మద్ అన్సారీ (26)లు ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.