ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం
న్యూఢిల్లీ: ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది. జార్జ్ ముత్తూట్ కు భార్య సారా జార్జ్ ముథూట్, ఇద్దరు కుమారులు జార్జ్ ఎం. జార్జ్, అలెగ్జాండర్ జార్జ్ ఉన్నారు. కాగా 71 ఏళ్ల ముథూట్ చాలా కాలంగా నేషనల్ క్యాపిటల్‌లో ఉన్నాడు, అయినప్పటికీ బంగారు రుణాల నుండి సెక్యూరిటీలు, రియాల్టీ ఎస్టేట్ నుండి మౌలిక సదుపాయాలు, ఆస్పత్రుల నుండి ఆతిథ్యం మరియు విద్య వరకు 20 కి పైగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అతని వ్యాపారాలకు సంబంధించి కొచ్చిలో ప్రధాన కార్యాలయం ఉంది.
1949, నవంరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జన్మించారు జార్జ్ ముత్తూట్. కుటుంబ వ్యాపారంలో చిన్న వయస్సులోనే ప్రవేశించారు. మూడో తరానికి చెందిన వారు. 1979లో మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్ గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది.
కాగా దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా జార్జ్ ముత్తూట్ వ్యవహరిస్తున్నారు. కాగా ఎంజీ జార్జ్ ముత్తూట్ హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాయి.
MG George, Chairman Muthoot Group passed away. RIP pic.twitter.com/6GZGLuDRXr
— Liz Mathew (@MathewLiz) March 5, 2021