ములుగులో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం

ములుగు: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు కార్యాలయంలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సెక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ యువత కే కాకుండా యావత్ ప్రపంచ యువతకు వివేకానంద మార్గదర్శక మని, ఆయన జీవన విధానం యువతకు ఆచరణీయం, ఆదర్శనీయమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సూపరిండెంట్ వాజిద్ హుస్సేన్ సిబ్బంది కిరణ్, నూరుద్దీన్, బద్రి ప్రసాద్, ఫిరాసత్, కిరణ్ కుమారి, ఏ పీ ఓ సాంబయ్య, DCEB అసిస్టెంట్ సెక్రటరీ విక్రమ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.