ములుగులో పిజ్జా కార్నర్.. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు

ములుగు: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలనే ఉద్దేశం తో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పిజ్జా కార్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అద‌న‌పు క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ఫోన్ కాల్ ( 7702027826) ద్వారా కూడా డోర్ డెలివరీ చేయ‌నున్నార‌ని అన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా ములుగు జిల్లా లో కూడా పిజ్జా దొరుకుతుందని నవ భారత మండల సమాఖ్య ములుగు వారు నిరూపించారని వారు అన్నారు. ఇదే స్ఫూర్తితో మండలాల వారీగా కూడా స్థాపించాలని, మహిళా సంఘాల ద్వారా జీవనోపాధికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ పిడి పారిజాతం మాట్లాడుతూ.. గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 3లక్షల 50వేలు రుణం అందించి వారికి అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేయించడం జరిగిందని, ప్రస్తుతం వారికి 1లక్ష రూపాయల అదనపు రుణం కల్పించి పిజ్జా కార్నర్ షాపులను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ములుగు జిల్లాలోనే మొట్టమొదటి పిజ్జా కార్నర్ అందులోనూ దీనిని మహిళా సంఘ సభ్యులచేత నిర్వహించబడటం జరుగుతుందని ఆమె తెలిపారు. ములుగు జిల్లా ప్రజలకు స్వచ్చమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలచే ఈ క్యాంటీన్, పిజ్జా కార్నర్ ను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రమాదేవి, జడ్పీ సీఈఓ ప్రసూనరాణి, ఎంఆర్ఓ సత్యనారాయణ స్వామి, శ్రీనిధి మేనేజర్ అరుణ్ సింగ్, ఏపిడి శ్రీనివాస్, డిపిఎం లీలాకుమారి, ఏపిఎం వేణుగోపాల రావ్, సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.