ములుగులో 5వ‌ రోజు కొనసాగుతున్న రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు

ములుగు: జిల్లా కేంద్రంలో AIKSCC ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు దీక్షలో తెలంగాణ రైతుకూలి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పీర్ల పైడి ప్రారంభించి.. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి భారతదేశ వ్యవసాయాన్ని అదానీ అంబానీ కార్పొరేట్ చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నార‌ని ఆరోపించారు. దేశ వ్యవసాయ 80% సన్న చిన్నకారు రైతుల తో ముడిపడి ఉన్నది భారతదేశానికి కార్పొరేట్ వ్యవసాయం అవసరంలేదని అన్నారు. ఇవి అమలు జరిగితే దేశంలో రైతులు రైతు కూలీలు వ్యవసాయ ఆధారిత ఆధారపడి ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తక్షణమే ఈ రైతు వ్య‌తిరేక చట్టాలను రద్దు చేయాల‌ని డింమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి భారత రైతాంగ పై ప్రేమ ఉంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రైతు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలు చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ములుగు జిల్లా కార్యదర్శి పల్లె బోయిన స్వామి, అధ్యక్షులు కొత్తపెళ్లి యాకూబ్, ఇనుగాల శ్రీను, పొన్నం చందర్, మాట్ల కొమురయ్య, వెంబడి ముత్యాలు, పాల్ యాదగిరి, వల్లే రవి, జనగాం విజయ, మచి పాక వెంకటేష్, వసంత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.