మూడో రౌండ్లోనూ బిజెపి ఆధిక్యం

దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యం కొనసాగుతోంది ఇప్పటి వరకు వెలువడి మూడు రౌండ్ల ఫలితాల్లోనూ బిజెపి ఆధిక్యంలో ఉంది.
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యం సాధించింది.
దుబ్బాక ఉపఎన్నిక మూడో రౌండ్‌ల కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు 1,259 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీకి 9,223.. టీఆర్‌ఎస్‌కి 7,964.. కాంగ్రెస్‌కి 1,931 ఓట్లు లభించాయి.
దుబ్బాక ఉపఎన్నిక రెండో రౌండ్‌లో బీజేపీ 279 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1,282 ఓట్లు లభించాయి. మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ మొత్తం 620 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 4,769, టీఆర్ఎస్‌కు 4,419 ఓట్లు, కాంగ్రెస్‌కు 922 ఓట్లు లభించాయి.
దుబ్బాక ఉపఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు.