మెంతులు ఔషధంగా మన‌కు ఎంత మేలు చేస్తాయంటే..

మన వంటింట్లో ప్రతి నిత్యము వాడే పదార్థాలలో మెంతులు చాలా ముఖ్యమైనవి. మెంతుల్ని పొడిగా చేసి వంటకాల్లో వాడడం ఆరోగ్యకరమైన అలవాటు. సియాటికా నొప్పి వచ్చి కాలు లోపలి నరం లాగుతున్నప్పుడు మెంతి పొడి లో సొంటి పొడి, పసుపు కలిపి గోరువెచ్చని నీటిలో వేసి రోజుకు రెండుసార్లు త్రాగితే సియాటికా నొప్పి తగ్గిపోతుంది. మెంతులను వాడితే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత భోజనంలో తింటే జలుబు తగ్గిపోతుంది. కీళ్లనొప్పి, చక్కెర వ్యాధి మెంతి కాషాయం తో తగ్గిపోతుంది. గోధుమపిండి లో మెంతి కూర నెయ్యి వేసి బాగా కలిపి రొట్టెలు చేసి తింటే నంజు వ్యాధి, అజీర్తి తగ్గి పోతుంది. మెంతి కూరను స్టీమ్ లో వేడి చేసి మోకాళ్ళ పై కట్టుకొని రాత్రి పడుకుంటే మోకాళ్ళ నొప్పి తగ్గి పోతుంది.

మెంతులు పచ్చళ్ళను నిలువ ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకని వేయించిన మెంతిపొడి వేయకుండా నిలువ పచ్చళ్ళు తయారు కావు. మెంతులలో vitamin ” E ‘అధిక మోతాదులో ఉంటుంది. అనేక వృద్ధాప్య సమస్యలనుండి ఇది కాపాడుతుంది. ముఖ్యముగా మతిమరుపు రాకుండా కాళ్లు చేతులలో వణుకు రాకుండా కాపాడుతుంది. మెంతులు మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడతాయి.బాలింతలకు మెంతి పొడి వాడితే పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులు సూక్ష్మజీవులతో పోరాడి మనకు ఎన్నో వ్యాధులు రాకుండా కాపాడతాయి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కడుపు నొప్పి వచ్చినప్పుడు మజ్జిగలో మెంతులు పొడి వేసి తాగితే నొప్పి తగ్గిపోతుంది పాలలో మెంతులను ఉడికించి త్రాగితే మొలల వ్యాధి తగ్గిపోతుంది సెగ గడ్డలు వచ్చినప్పుడు మెంతుల్ని నానబెట్టి నూరి గోధుమ పిండితో కలిపి పట్టి వేస్తే గడ్డలు కరిగిపోతాయి మెంతి పొడి సొంటి పొడి తేనె కలిపి త్రాగితే కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది ఎండిన మెంతికూర ఆకులను రుచి కోసం అనేక వంటలలో వాడతారు దీన్ని కసూరి మెంతి పేరుతో బజార్లో అమ్ముతారు,కాళ్ళ పగుళ్ళకు నానబెట్టిన మెంతులు మరియు గోరింటాకు మెత్తగా నూరి లేపనం చేస్తే కాలి పగుళ్లు తగ్గిపోతాయి ను న్నపడతాయి

-పి.కమలాకర్ రావు

Leave A Reply

Your email address will not be published.