మేనిఫెస్టో: అన్నాడీఎంకే వరాల జల్లు!

చెన్నై: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. రేషన్‌ కార్డుదారులకు అమ్మ వాషింగ్‌ మెషన్లు, ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు, ఇంటి వద్దకే రేషన్, మహిళల కోసం ఇంటి దీపం పథకం, ఇంటింటా సౌరశక్తి గ్యాస్‌ స్టౌవ్‌లు, ఏడాదికి ఆరు సిలిండర్లు తదితర వాగ్ధానాలతో అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు.

మేనిఫెస్టోలోని విష‌యాలు..

అందరికీ ఇళ్లు, మహిళల కోసం అమ్మ ఇంటి దీపం పథకం, మహిళలకు ప్రయాణ చార్జీల్లో రాయితీ, ఉచిత వాషింగ్‌ మెషన్, సౌర శక్తి స్టౌవ్‌లు, ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు, 2023– అమ్మ విజన్‌ అమలు, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, కేబుల్‌ ప్రసారాలు, అమ్మ వివాహ కానుక పెంపుతో పాటు నవ దంపతులకు అన్ని రకాల వస్తువులతో ప్రత్యేక సారె.

రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌ల విస్తరణ, క్యాన్సర్‌ చికిత్సకు ప్రాధాన్యత. ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగింపు, మహిళా శివు సంరక్షణ నిధి పెంపు, మహిళ భద్రతకు అన్ని నగారాల్లోనూ గస్తీ వాహనం, పోలీసు యాప్, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు, అమ్మ బ్యాంకింగ్‌ కార్డుల పంపిణీ, ఇంటింటా దోమ తెరలు.

రుణాలు రద్దు, 2జీబీ ఉచిత డేటా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళులకు ప్రత్యేక ప్రా«ధాన్యతకు చర్యలు. పట్టణాలు, నగరాల్లో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల ఏర్పాటు.

వృద్ధాప్య ఫించన్లు రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంపు. ప్రత్యేక ప్రతిభావంతులకు రూ. 1,500 నుంచి రూ. 2500 పెంపు.

జాతీయ అధికార భాషగా తమిళం. మద్రాసు హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా మార్చడం, తమిళంలోనే వాదనలకు అనుమతి. తమిళాభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక విభాగం, ఈలం తమిళుల సంక్షేమం, జంట పౌరసత్వం, రాజీవ్‌ హంతుకుల విడుదల.

పెట్రోల్‌ర, డీజిల్‌ ధర తగ్గింపునకు చర్యలు. 150 రోజులకు ఉపాధి పథకం పొడిగింపు. అమ్మగ్రీన్‌ హౌస్‌ నిర్మాణ సాయం రూ. 3.40 లక్షలకు పెంపు, సంక్రాంతి కానుక కొనసాగింపు. నెలసరి విద్యుత్‌చార్జీల వసూళ్లు, 9,10,11,12 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార పథకం. అంగన్‌వాడీ పిల్లలకు పాలు, ఆటో డ్రైవర్లకు ఎంజీఆర్‌ గ్రీన్‌ ఆటో పథకం పేరిట రూ. 25 వేలు సాయం.

Leave A Reply

Your email address will not be published.