మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ (గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌గా విజయలక్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్, గాజులరామారం కార్పొరేటర్ ప్రతిపాదించారు.
- గద్వాల విజయలక్ష్మి(బంజారాహిల్స్)
- వయస్సు: 56
- భర్త: బాబీరెడ్డి
- విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
- కులం: మున్నూరు కాపు (బీసీ)
రాజీయ అనుభం: 2016లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి అదే డివిజన్ నుంచి గెలుపొందారు.