మే నెలలో పదో తరగతి పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మే నెలలో జరుగనున్నాయి. ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, మే నెలలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉండాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధానోపాధ్యా యులు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులతో నిన్న ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. జనవరిలో ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో, 7, 8 తరగతులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయన్నారు. ఏప్రిల్ వరకు సమయం ఉడటంతో సిలబస్‌ను హడావుడి పూర్తిచేయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులకు సూచించారు. సిలబస్‌ను ఇప్పటికే తగ్గించామని, దీంతో అన్ని అంశాలనూ పూర్తిగా బోధించాలని చెప్పారు.