మే లో UGC-NET పరీక్షలు
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ వెల్లడించారు. మే నెలలో UGC-NET పరీక్షలు జరుగనున్నాయని కేంద్ర విద్యాశాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సబ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు.
