మోకా మరణం తీరని లోటు: మంత్రి పినిపే విశ్వరూప్

కాట్రేనికొన (తూర్పు గోదావరి): మాజీ మంత్రి మోకా శ్రీ విష్ణు ప్రసాదరావు మరణం జిల్లా ప్రజలందరికీ తీరని లోటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సోమవారం మంత్రి కాట్రేనికోనలో విష్ణు ప్రసాద రావు స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు.అర్పించారు. ఆనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీ విష్ణు ప్రసాద రావు మరణం ప్రధానంగా దళిత వర్గానికి తీరని లోటని, కోనసీమ ప్రాంతంలో తొలిసారిగా శాసన సభకు ఎన్నికై మంత్రి అయిన మొదటి వ్యక్తని శ్రీ విష్ణు ప్రసాద రావు మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని,తాను రాజకీయాలలోకి వచ్చాక అనేక పర్యాయాలు ఆయనను కలిసి సలహాలు,సూచనలు తీసుకునేవాడినని, శ్రీ విష్ణు ప్రసాద రావు దళితుల అభ్యున్నతి కి విశేషంగా కృషి చేసిన దళిత నాయకుడని మంత్రి కొనియాడారు.
ఆ రోజుల్లో పాలేరు నాటకం ద్వారా ఎందరినో ఆయన ప్రభావితం చేశారని మంత్రి తెలిపారు. శ్రీ విష్ణు ప్రసాద రావు భౌతిక కాయానికి బుధవారం అధికార లాంఛనాలు అంత్యక్రియలు జరపాలనే ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు తాను సి.ఎం.ఓ., ప్రిన్సిపల్ సెక్రటరీ,చీఫ్ సెక్రటరీ తో మాట్లాడటం జరిగిందన్నారు. ఆయన అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలు తో జరగాలనేది ఆయన చివరి కోరిక, ఆయన కుటుంబ సభ్యుల కోరిక, నా కోరిక కోట్లాది దళితుల కోరిక అని మంత్రి చెబుతూ ముఖ్య మంత్రి శ్రీకాళహస్తి పర్యటనలో వున్నారని ఈ సాయంత్రానికి వస్తారని ఆయన వచ్చిన వెంటనే ఇందుకు సంభందించి ఉత్తర్వులు రావచ్చనే ప్రగాఢ విశ్వాసం తో ఉన్నామని ఉత్తర్వులు వచ్చిన వెంటనే జిల్లా ఎస్పి,జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బుధవారం అధికార లాంఛనాల తో అంత్యక్రియలు జరగవచ్చునని విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు.