మ‌జ్లిస్‌కు మేయ‌ర్ ప‌ద‌వి పిచ్చి ప్ర‌చారం : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల అనంత‌రం మ‌జ్లిస్ పార్టీకి మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తార‌నేది పిచ్చి ప్ర‌చారం అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. గ‌త గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కంటే ఇప్పుడు మెరుగైన సీట్లు సాధిస్తాం. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండ‌దు. గ‌త ఎన్నిక‌ల్లో ఐదు మ‌జ్లిస్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. డిసెంబ‌ర్ 4 త‌ర్వాత టీఆర్ఎస్ మ‌హిళా అభ్య‌ర్థే మేయ‌ర్ అవుతారు.. ఇందులో అనుమానం అక్క‌ర్లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో రోజుకు 50వేలమంది పేదలకు అన్నపూర్ణ ద్వారా నాణ్యమైన భోజనాలు అందిస్తున్నామని, లక్ష బెడ్ రూమ్ లను కడుతున్న ఏకైక నగరం హైదరాబాద్ అని అన్నారు. గత ఆరున్నర ఏళ్లలో హైదరాబాద్ ఎలాంటి కర్ఫ్యూలు లేవని, బాంబు పేలుళ్ల వంటివి లేవని అన్నారు. దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇప్పుడు నగరానికి ఐకాన్ గా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని అన్నారు. సామాన్యుడి ప్రభుత్వంగా పాలన అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. నగరంలో కొన్ని చోట్ల భూసమస్యలు ఉన్నాయని వాటిని టిఆర్ఎస్ సర్కార్ పరిష్కరించగలదని అన్నారు. రెండోదశ మెట్రోను తామే పూర్తి చేస్తామని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీచేస్తామని గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 స్థానాల్లో విజయం సాధించామని, ఈసారి 10 గెలుస్తామని అన్నారు. మజ్లీస్ తో తమకు పొత్తు ఎలాంటి పొత్తు లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. రెండు, మూడు రోజుల్లో ఆ వివ‌రాలు విడుద‌ల చేస్తాం. ప్ర‌జ‌ల మీద ఒక పైసా కూడా భారం మోప‌లేదు. ఎలాంటి బిల్లులు పెంచ‌లేదు. రాష్ర్ట ఆదాయం పెంచి సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా పేద‌ల‌కు సాయం చేశాం.. ప‌న్నులు పెంచ‌లేదు.. ఇబ్బంది పెట్ట‌లేదు. ప్రాప‌ర్టీ ట్యాక్స్, వాట‌ర్ బిల్లులు, ఎల‌క్ర్టిసిటీ బిల్లులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలు పెంచ‌లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.