మరి వాళ్లేమైనా బంగ్లాదేశీయులా?: ఉద్ధవ్

ముంబయి: ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాము గెలిస్తే బిహార్ ప్రజలకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని బిజెపి హామీ ఇవ్వడాన్ని శివసేన అధినేత, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే తప్పుపట్టారు. మిగతా రాష్ట్రాల వాళ్లు బంగ్లాదేశ్ నుంచో, కజకిస్థాన్ నుంచో వచ్చారని ఆ పార్టీ భావిస్తోందా? అని ప్రశ్నించారు. శివసేన నిర్వహించే దసర వేడుకల్లో ఆదివారం ఆయన మాట్లాడారు… ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. శివసేన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది అయిందని, తాను సీఎం అయిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొందరు అంటూనే ఉన్నారని మహారాష్ట్రలో విపక్ష పార్టీలపై ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. ‘నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ధైర్యం ఉంటే చేసి చూపించండి’ అని థాక్రే సవాలు విసిరారు. హిందుత్వం గురించి ఎవరూ తమకు చెప్పనక్కర్లేదని అన్నారు. హిందుత్వం గురించి చెప్పే వాళ్లు రాష్ట్రంలో ఆలయాలు ఎందుకు తెరవడం లేదని కొందరు తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారని, బాలాసాహెబ్ హిందుత్వానికి ఉద్ధవ్ థాకరే హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని వారు ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. వాళ్ల (ప్రత్యర్థులు) హిందుత్వం కేవలం అరుపులకే పరిమితమని, తమ హిందుత్వం అలాంటిది కాదని సీఎం చురకలు వేశారు.
[…] […]