మహారాష్ట్రలో కొత్తగా 2,768 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,768 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా 25 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,41,398కు, మరణాల సంఖ్య 51,280కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 1,739 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,934 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్లో వెల్లడించింది.