మ‌హారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు: ఐదుగురి మృతి

ముంబ‌యి: మ‌హారాష్ట్రలో బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర, నందూర్‌బార్‌లో బుధవారం జ‌రిగిన‌ ప్ర‌మాదంలో బ‌స్సు లోయ‌లో ప‌డి ఐదుగురు ప్ర‌యాణికులు అమ‌ర‌ణించారు. 35 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఎస్పీ మహేంద్ర పండిట్‌ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన బస్సు దాదాపు 40 మంది ప్రయాణికులతో మల్కాపూర్‌ నుంచి సూరత్‌ వెళుతోంది. బుధవారం ఉదయం నందుబార్‌లోని ఖాంఛౌన్‌ దార్‌ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అదుపుతప్పి పక్కనే ఉన్న 80 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ప్ర‌మాదంలో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అత్యవసర వైద్యం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు ప్ర‌యాణికులకు తీవ్ర‌గాల‌యిన‌ట్లు తెలిసింది.. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.