మహబూబ్‌నగర్ జిల్లా: చెరువులో మృతదేహాలు

మహబూబ్‌నగర్: జిల్లాలోని బాలానగర్ మండలంలోని ఉడిత్యాల చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలియాడుతూ ఉన్న దృశ్యాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం గ్రామస్థులు ఈ మృతదేహాలను గుర్తించారు. చెరువు సమీపంలో ఓ బైక్ కూడా ఉన్నదని స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులుకేసు నమోదచేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.