యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నది. దీంతో స్వామివారి దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. ఈనేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు లఘుదర్శనం కల్పిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి.