యాదాద్రిలో ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ గురువారం దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి ఇవాళ మధ్యాహ్నం 12.22 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. బాలాలయం వద్ద దర్శనానికి వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం ముఖ్య‌మంత్రి ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.