యుపిలో పట్టాలు తప్పిన ట్రైన్..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అమృత్‌సర్ నుంచి జయనగర్ వెళ్తున్న రైలు లక్నో డివిజన్‌లోని చార్‌బాగ్ స్టేషన్ వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఆ బోగీల్లో 155 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. రెండు బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయని, ఈ ఘటనకు గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్ఎం సంజయ్ త్రిపాఠి పేర్కొన్నారు.