యువతిని హత్యచేసిన ఢిల్లీ బాబు ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో యువతి ప్రాణాలు తీసిన ప్రేమోన్మాది ఢిల్లీ బాబు (19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి అడవిలో ఉరేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. పెనుమూరు మండలం తూర్పుపల్లికి చెందిన గాయత్రి (20) అనే యువతిని పూతలపట్టు మండలం చింతమాకులపల్లికి చెందిన ఢిల్లీ బాబు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రెండు నెలలుగా ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. యువతి తండ్రి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయత్రికి మైనర్ కావడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇండ్లకు వారిని పంపించారు.
పోలీసుల మందలింపుతో గత కొద్ది రోజులుగా ఢిల్లీబాబును గాయత్రి దూరం పెడుతూ వస్తోంది. ఫోన్ చేయడంతో పాటు నేరుగా కలిసి యువతితో వాగ్వాదానికి దిగుతున్నాడు. దీనికి అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంపరాళ్ల కొత్తూరు వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గాయత్రిని అటకాయించి.. వెంట తెచ్చుకున్న కత్తితో గాయత్రిపై దాడి చేశాడు. పొత్తి కడుపులో బలమైన గాయాలు కావడంతో రక్తపు మడుగులో కొట్టమిట్టాడింది. వెంటనే పెనుమూరు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి తమిళనాడులోని వేలూరు సీఎంసీ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ఘటన అనంతరం ఢిల్లీబాబు తనబైక్‌పై పరారయ్యాడు. గాగమ్మవారిపల్లి సమీపంలో వాహనాన్ని వదిలేసి అడవిలోకి పారిపోయాడు. ఈ రోజు మధ్యాహ్నం తూర్పు పల్లి అడవిలో ఢిల్లీబాబు మృతదేహాన్ని గుర్తించారు.