యువతిపై ప్రేమోన్మాది దాడి
నార్సింగ్: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పరిధి హైదర్‌షాకోట్‌లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.