రాజమహేంద్రవరం: 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల

రాజమహేంద్రవరం : ఏ.పీలో 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు. కొన్ని పూచీ కత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగుమం చేసిన విషయం తెలిసిందే. విడుదలైనవారు శిక్షా కాలం పరిమితి ముగిసే వరకూ ప్రతీ మూడు నెలలకు ఒక సారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి.
బయటకు వెళ్ళిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి ముందుస్తూ విడుదల రద్దు అవుతుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి 19 మంది విడుదల కాగా వారిలో నలుగురు డీగ్రీ చదివినవారు ఉండగా, ఇద్దరు ఎం.ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. సెంట్రల్ జైల్ నుంచి ప్రత్యేకంగా మహిళా ఖైదీలు మాత్రమే విడుదల కావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి కావడంతో ఖైదీల కుటుంబాలలో ఆనందాలు వెల్లువెత్తాయి. తమ కుటుంబాలతో గడిపే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖైదీల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.