రామజన్మ భూమి ట్రస్ట్‌ ఖాతా నుంచి రూ.20 లక్షలు మాయం

అయోధ్య: యుపిలోని అయోధ్య రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు ఖాతానుంచి ఏకంగా రూ. 20 ల‌క్ష‌లు మాయం అయ్యాయి. ఇంత పెద్దమొత్తం మాయం అవ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కాగా అయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్‌కు చెందిన అధికారిక బ్యాంక్‌ ఖాతా నుంచి భారీగా సొమ్ము మాయమైంది. ట్రస్ట్‌ చెక్‌ ఉపయోగించి మొత్తం రూ.20 లక్షల వరకూ విత్‌ డ్రా చేశారు. సెప్టెంబర్‌ 1వ తేదీన లక్నోలోని బ్యాంక్‌ నుంచి రూ.6 లక్షలు, మరో రెండు రోజుల తరువాత రూ.3.50 లక్షలు ట్రస్ట్‌ చెక్‌ పేరుతో విత్‌ డ్రా చేసుకున్నారు. ఇక మూడో సారి రామజన్మ భూమి ట్రస్టుకు ఏకంగా రూ.9.86 లక్షలకు టోకరా పెట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు మాయమవుతుండటంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ట్రస్టు సభ్యులకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అయోధ్య పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.