మెగాస్టార్ కొత్త అవ‌తారం!

హైద‌రాబాద్: అగ్ర‌క‌థానాయ‌కుడు చిరంజీవి కొత్త లుక్‌తో అభిమానుల‌కి షాక్‌కు గురిచేశాడు. ఇటీవల క్లీన్‌ షేవ్‌లో కనిపించి అందరినీ ఆశ్యర్యపరిచిన మెగాస్టార్‌ చిరంజీవి.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్‌లో ఓ పిక్‌ పోస్ట్ చేసి షాకిచ్చారు. అభిమానులే కాదు ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ సైతం `నాన్న నేను చూస్తున్న‌ది నిజ‌మేనా` అంటు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాడు. ఇప్పటి వరకు చిరంజీవిని ఇలా చూసి ఉండరు. కానీ మరి ఎందుకు ఇలా చిరు ట్రై చేస్తున్నాడనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఏజ్‌ పెరుగుతున్నా.. తనలో పవర్‌ తగ్గలేదనే విధంగా.. క్లీన్‌ షేవ్‌లో కనిపించి తన వయసు ఇంకా మీరు అనుకున్నంత కాదు అనేలా సర్ప్రైజ్‌ చేసిన మెగాస్టార్‌, తాజా లుక్‌తో అస్సలు మెగాస్టారేనా అనేలా షాకిచ్చారు.

 

రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుసు సినిమాల‌తో అభిమానుల‌ను ఖుషీ చేస్తున్న చిరు గుండు చేయించుకుని, న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాల‌తో ఉన్న ఫొటోను అభిమానుల‌తో పంచుకుంటూ.. “నేను సాధువులా ఉన్నానా“ అంటూ ట్యాగ్ చేశారు. ఈ ఫొటో విష‌యానికి వ‌స్తే భవిష్యత్తులో ఇలాంటి క్యారెక్టర్ కి ట్రయల్‌గా ఇలా ట్రై చేశారా? లేదంటే దీనికి మరెదైనా కారణం ఉందా? అనేది తెలియాలంటే వెయిట్‌ చేయక తప్పదు. కాని ఈ ఫొటో చూసిన అభిమానుల‌కు పండ‌గే.. ఈ ఫోటో పెట్టిన కొద్ది సేప‌టికే లైక్‌లు, కామెంట్ల వ‌ర‌ద పారించారు అభిమానులు.

Leave A Reply

Your email address will not be published.