రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 55359 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బారినపడివారి సంఖ్య 1,91,386కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో మరో 2243 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,60,933కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 29,326 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 23,880 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కరనాతో నిన్న మరో 11 మంది బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1127 మంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎసీ పరిధిలోనే 298 కేసులు ఉన్నాయి. తర్వాత మేడ్చల్ మల్కాజిగిరిలో 176 మంది, రంగారెడ్డిలో 172 మంది, నల్లగొండలో 141మంది, కరీంనగర్‌లో 103 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 102 మంది, ఖమ్మంలో 93 మంది, సిద్దిపేటలో 92 మంది, వరంగల్ అర్బన్‌లో 85 మంది, సంగారెడ్డిలో 63 మంది, నిజామాబాద్‌లో 57 మంది, కామారెడ్డిలో 53 మంది, సూర్యాపేటలో 51 మంది, జగిత్యాలలో 46 మంది, మహబూబ్‌నగర్‌లో 45 మంది, మహబూబాబాద్‌లో 45 మంది, వనపర్తిలో 41 మంది, రాజన్న సిరిసిల్లలో 40 మంది, వరంగల్ రూరల్‌లో 35 మంది, నాగర్‌కర్నూల్‌లో 32 మంది, యాదాద్రి భువనగిరిలో 31 మంది, ములుగులో 31 మంది, పెద్దపల్లిలో 31 మంది, మెదక్‌లో 30 మంది, జనగామలో 29 మంది, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌లో 26 మంది, మంచిర్యాలలో 27 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 25 మంది, ఆదిలాబాద్‌లో 24 మంది, నిర్మల్‌లో 24 మంది, వికారాబాద్‌లో 24 మంది, జోగులాంబ గద్వాలలో 23 మంది, నారాయణపేటలో 8 మంది మంది చొప్పన కేసుల చొప్పున నమోదయ్యాయి.