రాష్ట్రంలో రేపు పల్స్‌ పోలియో

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం మొద‌లు కానుంది. ఈ కార్య‌క్ర‌మం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కొనసాగనుంది. హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు కొన‌సాగుతుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లుగా సమాచారం. 23,331 కేంద్రాల ద్వారా పోలియో చుక్కల పంపిణీ కొనసాగనుంది.

Leave A Reply

Your email address will not be published.