రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రప‌తి, ప్ర‌ధాని

న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని… ఎనిమిదో వసంతలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రాష్ర్ట ఆవిర్భావ‌ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో మ‌రింత అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు. ఇంటింటికి తాగునీరు ఇచ్చే జాతీయ ల‌క్ష్యాన్ని తెలంగాణ సాధించింద‌ని రాష్ట్రప‌తి ప్ర‌శంసించారు.

అన్ని రంగాల్లో రాణిస్తున్న‌ తెలంగాణ : ప్ర‌ధాని మోడీ
తెలంగాణ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ‌ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్ర‌ధాని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.