రూ.12 వేల కోట్ల రైతు రుణమాఫీ: తమిళనాడు సిఎం

చెన్నై: తమిళనాట రైతన్నకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రైతులు రుణాలుగా తీసుకున్న సుమారు రూ. 12 వేల కోట్లు మాఫీ చేయనుంది. ఈ మేరకు అన్నాడీఎంకే గవర్నమెంట్ ప్రకటించింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న దాదాపు 16 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఆయన ఈవిషయాన్ని చెప్పారు.