రూ.18లక్షల విలువైన బంగారం పట్టివేత

తిరువనంతపురం : విమానాశ్రయాల్లో అధికారులు ఎప్పటికప్పుడు బంగారాన్ని పట్టుకుంటున్నా అక్రమార్కులు మాత్రం మారడం లేదు. కొత్త కొత్త దారులు బంగారాన్ని అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. తాజాగా కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి 364 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) అధికారులు తెలిపారు. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.18లక్షల వరకు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని స్క్రూల రూపంలో తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. చెక్ ఇన్ బ్యాగేజీలో ఉంచగా.. గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు.